• జిల్లా పోలీసు వాహనాలకు వినియోగించిన విడిభాగాల బహిరంగ వేలం.
• ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొని విడిభాగాలను సొంతం చేసుకోవచ్చు.
– జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
TG 5,సంగారెడ్డి ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, జిల్లా పోలీసు వాహనాలకు వినియోగించిన కాలం చెల్లిన విడిభాగాలను ఈ నెల 13వ తేదీన (13-05-2026) ఉదయం 11:00 గంటలకు జిల్లా పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని తెలిపారు.
కావున ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొని వాహన విడిభాగాలను సొంతం చేసుకోవచ్చని అన్నారు.
వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
• సాయి తేజ – 8179412752
• నాగార్జున రెడ్డి – 9440525162
వేలం పాటలో ఈ దిగువ తెలిపిన వస్తువులు కలవు:
1. టైర్లు మరియు ట్యూబ్స్
2. బ్యాటరీలు
3. ఇతర వాహన విడిభాగాలు









