బడంగ్ పేట్ సర్కిల్:
మహేశ్వరం నియోజకవర్గం
శంషాబాద్ జోనల్ పరిధి లోని బడంగ్పేట్ సర్కిల్ ప్రశాంతి హిల్స్ డివిజన్లో 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంప్ క్రీడలను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TUFIDC చైర్మన్ చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు.డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్‌లో విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, కరాటే, బాస్కెట్‌బాల్, చెస్ వంటి క్రీడల్లో శిక్షణ అందిస్తున్నారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…..పిల్లలు చదువుతో పాటు ఆటల పైనా సమాన ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వేసవి కాలంలో వారికి ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో క్రీడల్లో ప్రతిభ కనబరచేలా చేయాలన్నారు.బడంగ్పేట్లో అదనంగా మరిన్ని సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్రీడా మైదానాన్ని మంచి కోచ్‌లకు అప్పగించి సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.అదనంగా,క్రీడా ప్రాంగణం సమీపంలో పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని, మైదానంలో లైటింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మీర్పేట్ మెయిన్ రోడ్ నుండి క్రీడా ప్రాంగణం వరకు మంచి రహదారి నిర్మించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ సర్కిల్ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతరులు పాల్గొన్నారు.









