నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని ములకలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట, శిలా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి మరియు బుడ్డారెడ్డి గూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట,శిలా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలకు బుధవారం నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను దేవాలయాల కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో దేవాలయాలు నిర్మించడం ద్వారా ప్రజలలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు,మండల నాయకులు,స్థానిక నాయకులు, భక్తులు,గ్రామ పెద్దలు,మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









