నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయానికి తేనెపల్లి గ్రామానికి చెందిన బిల్డర్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి సునీత దంపతులు 50,000 రూపాయల విరాళం అందజేసినందుకు బుధవారం దేవాలయ విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గట్టుపల్లి రవీందర్ రెడ్డి-సునీత దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి-,సునీత దంపతులు మాట్లాడుతూ..ములకలపల్లి శ్రీ సీతారామాంజనేయ దేవాలయ నిర్మాణానికి తమ వంతు ఉడతా భక్తిగా విరాళం అందజేసే మహాభాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Post Views: 10









