బడంగ్ పేట్ సర్కిల్:
ఈనెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.









