సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన టి.ఎల్. సంగీత

రిపోర్టర్: ఉల్లిగడ్డల శివకుమార్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మే 06:-
సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా టి.ఎల్. సంగీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె సన్నిహితంగా పరిచయం చేసుకున్నారు.

అడిషనల్ కలెక్టర్‌గా జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని టి.ఎల్. సంగీత తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు