TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి పట్టణంలోని ఎస్ వి ఎస్ గార్డెన్ కన్వెన్షన్ శిల్పారామం నందు నిర్వహించిన బోయిని రాజేశ్వరి రాజు దంపతుల ఏకైక పుత్రిక అంజలి శ్రీకాంత్ ముదిరాజ్ ల వారి వివాహ వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు.
పులిమామిడి రాజుకు వివాహ వేడుక నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు మరియు స్థానికులుపాండు, సుధాకర్, హన్మంతు, నర్సింలు, కృష్ణమూర్తి, పోచయ్య, అశోక్, శంకరయ్య, భూమేష్ మొదలగు వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక అని, వధూవరులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.









