రేపు బుడ్డారెడ్డి గూడెంలో అంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ నికి ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి రాక

గుర్రంపొడు మండల పరిధిలోని బుడ్డారెడ్డి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం (మే 06) అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగావిచ్చేయనున్నారు.ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, రేపు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం, ఉదయం 11:00 గంటలకు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మరియు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.ఈ సందర్భంగా గుర్రంపోడు మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారి రాక దృష్ట్యా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు