TG 5, సంగారెడ్డి ప్రతినిధి
• పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
03.05.2026న నిర్వహించబడుతున్న నీట్-యూజీ 2026 పరీక్ష దృష్ట్యా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తారా డిగ్రీ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – పోతిరెడ్డిపల్లి, కేంద్రీయ విద్యాలయం (ఒర్డినెన్స్ ఫ్యాక్టరీ) పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరవడానికి అనుమతిలేదని, అదేవిధంగా సెక్షన్-163 బి.యన్.యస్.ఎస్ (సెక్షన్-144 సి.ఆర్.పి.సి) అమల్లో ఉంటుందని, గుంపులు గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు.









