TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట మండల పరిధిలోని
ఆరూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజాపాలనలో భాగంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లకు సమూహిక గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద ప్రజలకు గృహ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సర్పంచ్ నాయికోటి లావణ్య – మధు మాట్లాడుతూ, ఇంకా అర్హులైన వారందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉంటే, వారు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, హౌసింగ్ ఏఈ రేష్మా, గ్రామపంచాయతీ కార్యదర్శి మల్లేశం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిద్ధన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మధు, ఉప సర్పంచ్ విఠల్, వార్డు సభ్యులు భారత్, భాగ్యలక్ష్మి, అంజయ్య,మన్నే నాగేశ్, పద్మ, భారతమ్మ, రమేష్, లక్ష్మి, నాగేశ్ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.









