TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సదాశివపేట పట్టణంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరైన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ ఎమ్మెల్యే అందరితో కాసేపు మాట్లాడారు.
చింత సాయినాథ్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు , మాజీ ZPTC పాండు, కౌన్సిలర్ విజయ్, చిక్కుల మల్లేశం , ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Views: 373









