ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశానుసారం గురువారం రోజున సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఐటిఐ సంగారెడ్డి, గ్లోబల్ గ్రీన్ కంపెనీ జహీరాబాద్, బోరెంచ టెంపుల్ వద్ద మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలు అనే అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ పూలభాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, షీ టీమ్ బృందాలు నిరంతరం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా మహిళలపై చూపుతున్న లింగ వివక్షత, పితృస్వామ్య వ్యవస్థ, పని ప్రదేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన నంబర్లు 100, 112, 1930, 1098 మరియు సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772 గురించి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్, సిబ్బంది కలిసి మహిళల భద్రత, బాలల రక్షణపై ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు