అషు రెడ్డి పోలీస్ కేసులో సంచలన మలుపు.. నెట్టింట వైరల్ అవుతున్న ఆడియో కాల్!

పెళ్లి పేరుతో ఎన్నారై ధర్మేంద్రను నమ్మించి సుమారు రూ. 9 కోట్లకు పైగా మోసం చేసిందనే ఆరోపణలతో పోలీసు కేసు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ బ్యూటీ, నటి అషు రెడ్డి వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి అషు రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో లీకై తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆడియో క్లిప్‌లో ఆమె ధర్మేంద్రను ఉద్దేశించి పలు షరతులు విధించడంతో పాటు హెచ్చరికలు జారీ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

లీకైన ఆడియో ప్రకారం.. ఈ వివాదంలోకి తన కుటుంబ సభ్యులను లాగవద్దని, ఏదైనా సమస్య ఉంటే ఇద్దరి మధ్యనే తేల్చుకోవాలని అషు రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తానని, మే నెల లోపు తొలి విడతగా రూ. 1.5 కోట్లు చెల్లిస్తానని, మిగతా మొత్తం తాను సెటిల్ అయ్యాక ఇస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వేణుస్వామి, ప్రవీణ తదితరుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుందామని, అలా కాకుండా తన కుటుంబాన్ని మధ్యలోకి తీసుకొస్తే రివర్స్‌లో నీపైనే హరాస్‌మెంట్ (వేధింపుల) కేసు పెడతానని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, తనపై వస్తున్న ఆరోపణలను అషు రెడ్డి తీవ్రంగా ఖండిస్తోంది. తన వాదన వినకుండా పోలీసులు ఏకపక్షంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అందువల్ల తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తాజాగా తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకపక్క ఈ కేసును కొట్టివేయాలని ఆమె కోర్టును ఆశ్రయించిన తరుణంలోనే, ఇలా సెటిల్మెంట్ ఆడియో లీక్ కావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆడియోలోని వాయిస్ నిజంగా అషు రెడ్డిదేనా అన్న దానిపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు