గుర్రంపోడు:ఏప్రిల్ 28(తెలంగాణ గళం)
ఉన్నత చదువులు చదవాలనే పట్టుదల కలిగిన పేద విద్యార్థులకు ఎన్నారై నాగులవంచ సందీప్ రావు అండగా నిలిచారు. మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన సంకటి అంబేద్కర్ అనే విద్యార్థి సిద్దిపేటలోని వినాయక లా కాలేజీలో ఎల్.ఎల్.బి అభ్యసించడానికి సందీప్ రావు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సందీప్ రావు పంపిన ఈ నగదును బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు మంగళవారం విద్యార్థికి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ.. విదేశాల్లో స్థిరపడినా పుట్టిన గడ్డపై మమకారంతో సందీప్ రావు విద్యార్థుల భవిష్యత్తు కోసం తోడ్పాటు అందించడం అభినందనీయమని కొనియాడారు.కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థిని దీవించారు.ఈ కార్యక్రమంలో నాగులవంచ నాగేశ్వరరావు,కట్టేబోయిన రాంబాబు,బైరు బలరాం,కుందారపు యాదగిరి, బాషపాక యాదయ్య,ఖాసీం, నాగులవంచ శ్రీనివాస రావు,షేక్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.









