- వరంగల్ 32వ డివిజన్లో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు శుభారంభం అయ్యాయి. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి అవసరమైన బోరు పనులను స్థానిక కార్పోరేటర్ పల్లం పద్మా రవి ప్రారంభించారు.
- ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
- ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 16









