ఫ్లాష్… ఫ్లాష్…ఫ్లాష్…
వరంగల్
వరంగల్ 27వ డివిజన్ కు చెందిన సన్నీ అనే 25 ఏళ్ల యువకుడు భారీ ఉద్యోగ మోసం చేసినట్టు ఆరోపణలు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి సుమారు రూ.2 కోట్లు స్వాహా
బాధితులకు డూప్లికేట్ ఎగ్జామ్ హాల్ టికెట్లు ఇచ్చినట్టు సమాచారం
తాను NTPC లో గెజిటెడ్ ఆఫీసర్ అని నమ్మబలికిన నిందితుడు
డూప్లికేట్ జాయినింగ్ లెటర్లు తయారు చేసి బాధితులను మోసం చేసినట్టు సమాచారం
పలు శాఖల మంత్రుల సంతకాలు, జిల్లా కలెక్టర్, NTPC అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు
నకిలీ పత్రాలతో ఉద్యోగాలు ఖాయం అని చెప్పి డబ్బులు వసూలు
మోసపోయిన బాధితులు బయటకు రావడంతో వెలుగులోకి
ప్రస్తుతం నిందితుడు, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టు సమాచారం….
ఫోన్ పే ల ఆధారాలతో కొంత మంది బాధితులు
బాధితుల పై కేసు నమోదు అవుతుందేమో అనే భయంతో విషయాన్ని కప్పి పుచ్చుతున్న బాధితులు
ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









