సంగారెడ్డి జిల్లాలో బాలల రక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై 6 రోజుల ప్రత్యేక అవగాహన సదస్సులు: ప్రారంభించిన ఎస్పీ పరితోష్ పంకజ్!

• ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ, బాలల రక్షణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై భరోసా, ఎ.హెచ్.టి.యు, షీ-టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు..
• బాలల సంక్షేమం, యువత అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయండి.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్..

TG5,సంగారెడ్డి ప్రతినిధి:
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా బాలల సంక్షేమం, యువత అభివృద్ధి కోసం భరోసా, ఎ.హెచ్.టి.యు, షీ-టీమ్ బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 6 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భరోసా, ఎ.హెచ్.టి.యు, షీ-టీమ్ బృందాలను ఉద్దేశించి మాట్లాడుతూ, బాలల రక్షణ మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎ.హెచ్.టి.యు ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, షీ-టీమ్ ఎస్ఐ పూలభాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు