TG 5, సంగారెడ్డి ప్రతినిధి
- ముఖ్య అతిథిగా హాజరైన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
- తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ర్యాలీ
- కలెక్టరెట్ అధికారికంగా జయంతి కార్యక్రమం
జిల్లా కేంద్రం సంగారెడ్డి లో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.సంగారెడ్డి పట్టణంలో వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి కార్యక్రమం లో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అతిధి గృహం నుంచి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. జై వాసవి జై జై వాసవి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్ర పారాయణం చదివారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య మహిళలు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
– కలెక్టరేట్ లో అధికారికంగా వాసవి మాత జయంతి…
రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా నిర్వహించారు.తహసీల్దార్ జైరాం నాయక్, కలెక్టరెట్ అధికారులు పాల్గొన్నారు









