వాసవి మాత జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు
TG 5,సంగారెడ్డి ప్రతినిధి సదాశివపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ భక్తులతో, ఆర్యవైశ్య సంఘ సభ్యులతో కలిసి ఆలయంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన ఎమ్మెల్యే ..
కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 22









