వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళ్ళులు..

TG 5,సంగారెడ్డి ప్రతినిధి:

ఈ సందర్భంగా ఆర్ఐ డానియెల్ మాట్లాడుతూ, వాసవి కన్యకా పరమేశ్వరి మాత గారి జీవితం శాంతి, అహింస, ధైర్యం, త్యాగం, సమానత్వం వంటి ఉన్నతమైన విలువలకు ప్రతీక అని తెలిపారు. ఆమె చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించుకోవడం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ ఈ విలువలను తమ దైనందిన జీవితంలో ఆచరించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.

 

వాసవి మాత ఆశీస్సులు అందరికీ లభించాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు