- హక్కుల సాధనకు కలిసి పోరాడుదాం
- శంకరగౌడ్ ఆత్మబలిదానం కలిచివేసింది..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
- ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది
- ఎమ్మెల్ చింతా ప్రభాకర్
- సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
TG5, సంగారెడ్డి ప్రతినిధి
ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధనకోసం సంఘటితంగా కలిసి పోరాడుడాం తప్ప కార్మికులు ఎవ్వరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకోవటం తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ
ఆత్మబలిదానాలకుఒడిగట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వల్ల
ఆర్టీసీలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. శంకర్ గౌడ్ ఆత్మబలిదానం కు కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.
అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ మాట తప్పారు. పీఆర్ సీ లతో పాటు కార్మికుల డిమాండ్లు ఏవీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు.
మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడు.
రేవంత్ రెడ్డి ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం అని ‘మీ వెంటే మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, సమస్యల నివారణకు తక్షణ చర్యలు చేపట్టి వారిలో విశ్వాసం కల్పించాలని కోరారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యానికి గురికాకుండా, కలిసికట్టుగా హక్కుల సాధన కు పోరాడుదాం అని అన్నారు.
దయచేసి ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు నిర్ణయాలు తీసుకోవద్దని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు.









