హైకోర్టు తీర్పు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలవాలి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగా రెడ్డి జిల్లా:
కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారం తో వ్యవహరిస్తూ,రాజకీయ ప్రతీకారం తో కేసులు పెడుతున్న ఈ పరిస్థితుల్లో, ఈ తీర్పు వారికి చెప్పపెట్టు అని అన్నారు.కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించడం తో, మాకు ఉన్న నమ్మకం మరింత బలపడింది అని తెలిపారు.నిజానికి తెలంగాణ ప్రజలు కూడా ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే అర్థం చేసుకున్నారు. రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టినప్పటికీ, కేసీఆర్ తప్పు చేశారని ఎప్పుడూ ప్రజలు నమ్మలేదు అని అన్నారు.ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేసే నాయకుడని అందరికీ తెలుసు అని ఎమ్మెల్యే అన్నారు.ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ఆయన చూపిన శ్రద్ధ ఎంతో విశేషం ఏ సమావేశం జరిగినా రైతుల సమస్యల పై చర్చించేవారు అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కొత్త దిశలో సాగింది. ఇది ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది.ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు సాధారణ ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటి. అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, సొరంగ మార్గాలు, కాలువలు కలిపి నిర్మించిన మహత్తర ప్రాజెక్టు ఇది. రైతులకు నీటిని అందించాలనే సంకల్పం తో దీనిని కేసీఆర్ పూర్తి చేశారు.ఈ ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం చేస్తూ లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సరైంది కాదు. వాస్తవానికి ఇది ఎంతో పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, దాని విస్తీర్ణం, నిర్మాణం, ప్రయోజనాలు చూసినప్పుడు ఖర్చులు సహజంగానే పెద్దవిగా ఉంటాయి.ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పై విమర్శలు చేయడం కన్నా, వాటిని సద్వినియోగం చేసుకుని రైతులకు మరింత మేలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రాజెక్టులు కూలిపోవాలని ఆశించడం కాదు,వాటిని బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత.మొత్తానికి, నిన్నటి న్యాయస్థానం తీర్పు నిజానికి న్యాయం గెలిచిన రోజుగా నిలిచింది. ఇది రాజ్యాంగ విలువలను కాపాడే ఒక ముఖ్యమైన సంకేతం.ప్రభుత్వ నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు – రైతుల పక్షాన డిమాండ్ ఇప్పటికీ అదే కాంట్రాక్టర్ ఉన్నా, మేమే పని చేస్తాం, అనుమతి ఇవ్వండి అని చెప్పినా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. కనీసం వారు చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి నిదర్శనం.ఎన్నికల ముందు రైతుల పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కే. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది.పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులపై కనీసం ఒకసారి కూడా రిపేర్ చేయించలేదు. గతంలో ఎంతో కష్టపడి చేసిన పనులను నాశనం అయినట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు వంటి భారీ ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తున్నారు. వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న భాగాలను మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించాలి. ప్రతి చెరువును నింపి, రైతుల పంటలకు నీటి భరోసా కల్పించాలి.మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించిన గొప్ప కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతోంది. వేసవి రాగానే కాలనీలు, గ్రామాల్లో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి.అలాగే, 24 గంటల ఉచిత విద్యుత్ ను కేసీఆర్ గారు అమలు చేసి రైతులకు పెద్ద ఊరట కల్పించారు. కానీ ఇప్పుడు గంటల తరబడి పవర్ కట్స్ పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.రైతు సంక్షేమానికి సంబంధించిన పథకాలు కూడా సరిగా అమలు కావడం లేదు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల అమలులో కూడా ఆలస్యం, పరిమితులు పెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము.కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న భాగాలను తక్షణమే మరమ్మతు చేయాలి.చెరువులు, కాలువలు నింపి రైతులకు సాగునీరు అందించాలి.మిషన్ భగీరథను సమర్థంగా నిర్వహించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలి నిరంతర విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి రైతు సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి.కేసీఆర్ చేసిన ప్రతి పని తెలంగాణ ప్రజల అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే. ఆ పనులను కాపాడటం, మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల సమస్యలను పరిష్కరించాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు