PRESS NOTE :-
హైదరాబాద్: 23 ఏప్రిల్ 2026.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు కె.లక్ష్మణ్, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎం.పి బూర నర్సయ్య గౌడ్, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుళ్ళ దేవేందర్ గౌడ్, విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ సకల జీవకోటికి ప్రాణాధారమైన గంగను దివి నుండి భువికి తెచ్చిన మహర్షి శ్రీ భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు మాట్లాడుతూ, సగర వంశవృక్షం చరిత్ర, భగీరథ గంగావతరణం మరియు సగరుల సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సగర కులాన్ని బీసీడీ నుండి బీసీఏ చేర్చేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భగీరథ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఉప్పరి రమేష్, ఎగ్గని నర్సింలు, బి.బి.ఆర్ వేణు, పెద్దబుద్ధుల సతీష్, మల్లికార్జున్, బాలకృష్ణ, ఉప్పరి మహేందర్ సాగర్, సగర సంఘం నాయకులు శేఖర్ సగర, హరికిషన్ సగర, శ్రీరాములు సగర, సగర కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









