పీసీ ఘోస్ట్ కమిషన్ నివేదిక పై హైకోర్టు తీర్పు తో కాంగ్రేస్ కుట్రపూరిత రాజకీయం బయటపడింది – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి : కాలేశ్వరం ప్రాజెక్ట్ పై పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాన్ని బయటపెట్టింది మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు వరప్రదాయని దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందని , ఆరువతల 50 మీటర్ల ఎత్తుకి నీరు పంపింగ్ చేస్తూ రైతాంగానికి సాగు నీరు అందించడం బహుశా ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్టు ఉండదని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం కేసీఆర్ చరిత్రని తుడుపాలని ఆలోచనతోనే ఉందని కానీ కెసిఆర్ గారు నిర్మించిన సెక్రటేరియట్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారని నూతన కలెక్టర్లే బిల్డింగులు ఏర్పాటు కూడా కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని ఇవన్నీ ఎలా తుడిచేస్తారని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వంకర బుద్ధిని మానుకుని రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి సారించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు