ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చల్లా ధర్మారెడ్డి సంఘీభావం: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే

  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన చల్లా ధర్మారెడ్డి..
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

పరకాల, ఏప్రిల్ 23:

ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘీభావం తెలిపారు. గురువారం పరకాల ఆర్టీసీ డిపోవద్ద సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల కష్టాలను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఎంతకాలం కార్మికులను మభ్యపెడుతారని ప్రశ్నించారు.రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉన్న ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని అన్నారు.మండే ఎండల్లో తమ డిమాండ్ల నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన తెలిపే కార్మికుల స్వేచ్ఛ హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు.నీడ కోసం టెంట్లు కూడా వేసుకొనివ్వకుండా పోలీసులు ఆపడం దారుణమన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను,సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు