నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్..
హైదరాబాద్ మౌలాలి లో డ్రగ్ తయారీ కేంద్రం పై సోదాలు…
17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ముగ్గురు నిందితుల అరెస్ట్..
69 కేజీల అల్ప్రజోలామ్.. ఎఫెడ్రిన్‌లను మత్తు పదార్థాలు స్వాధీనం..
హైదరాబాద్‌లోని మౌలాలీలోని ఐడిఎలో అల్ప్రజోలామ్, ఎఫెడ్రిన్ డ్రగ్స్ అక్రమంగా తయారు చేస్తున్న కేంద్రం పై ఎన్‌సిబి ( నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ) దాడులు చేసింది..
69.600 కిలోల అల్ప్రజోలామ్‌ను స్వాధీనం చేసుకుంది..
ఎఫెడ్రిన్ డ్రగ్ తయారీ ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది.
మౌలాలి పారిశ్రామిక రసాయన యూనిట్‌పై దాడి చేసి ముగ్గురు నిందితుల అరెస్టు.
ఈ సోదాల్లో రెండు ప్లాస్టిక్ డ్రమ్ములలో భారీగా డ్రగ్ మెటీరియల్ స్వాధీనం.
రెండు డ్రమ్ముల నుండి మొత్తం 69.600 కిలోల ఆల్ప్రజోలామ్ను స్వాధీనం..
ఆల్ప్రజోలామ్తో పాటు, ఆల్ప్రజోలామ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఎఫెడ్రిన్ కోసం వాడే రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
₹17.40 కోట్లు విలువైన అల్ఫ్రోజోలం, ఎఫడ్రిన్ స్వాధీనం..
ఒక కెమిస్ట్, మెటీరియల్ సప్లై చేసే వ్యక్తి.. మెటీరియల్ తరలించే వ్యక్తి అరెస్ట్…
ఈ ఆల్ప్రజోలామ్ను వేసవిలో అధిక డిమాండ్ ఉండే తెలంగాణలోని కల్లు దుకాణాలకు విక్రయించనున్నట్లు గుర్తించిన NCB..
ఈ ముగ్గురి నిందితులపై NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న NCB..









