జిల్లా పోలీస్ కార్యాలయం (డి.పి.ఓ)లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించి, హైదరాబాద్ సిటీ కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీపై వెళ్తున్న ఇ. కళ్యాణి, ఎ.ఓ గారికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఘనంగా వీడ్కోలు పలికారు.

TG5 ,సంగారెడ్డి ప్రతినిధి:

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఎ.ఓ ని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజమని అన్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, పోలీస్ రిక్రూట్మెంట్, కొత్త కానిస్టేబుల్స్ రిపోర్ట్ చేసిన మొదటి నెలలోనే వేతనం అందేలా సమర్థవంతంగా పనిచేసారని కొనియాడారు.

ప్రతి విషయాన్ని సవాలుగా స్వీకరించి, నిర్ణీత గడువులో పూర్తి చేసే తత్వం ఆమెదని అన్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో కూడా ఇదే విధంగా విధులు నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. జిల్లాకు ఆమె అందించిన సేవలను కొనియాడుతూ.., జ్ఞాపికను అందజేశారు.

ఎ.ఓ కళ్యాణి మాట్లాడుతూ, గడిచిన మూడు సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి డి.పి.ఓ సిబ్బంది సహకారమే కారణమని అన్నారు. సిబ్బంది చూపించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. సిబ్బంది అందరూ ఇదే విధంగా విధులు నిర్వహిస్తూ, సర్వీస్‌లో మంచి పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎఓ పద్మావతి, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, లాలూ నాయక్, నాగేశ్వర్ రావు, సూపరింటెండెంట్లు అశోక్, మోహనప్ప, డి.పి.ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు