హైదరాబాద్:
పహాల్గం ఉగ్రదాడి లో ప్రాణాలు కోల్పోయిన హిందువులకు హస్తినాపురం,చెంపాపేట్ బీజెపి నాయకుల తో కలిసి నివాళులు అర్పించిన అర్బన్ బీజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి.అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆర్ఎస్ఎస్,ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను హస్తినాపురం,చెంపాపేట చౌరస్తా లో బీజెపి శ్రేణు దహనం చేశారు.కేంద్రంలో బీజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక మల్లికార్జున ఖర్గే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.చర్యకు ప్రతి చర్య ఏ విధంగా ఉంటుందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ కి చేసి చూపించారని అన్నారు.ఉగ్రవాదులు ఉపేక్షించేది లేదని వారికి మద్దతుగా నిలుస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని తెలిపారు.మహిళా ఆక్రోష్ ర్యాలీ ట్యాంక్ బండ్ నుండి ఇంద్ర పార్క్ వరకు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.









