స్థానికం, సంగారెడ్డి ప్రతినిధి
జిల్లా వాప్తిగా శ్రీ విశ్వ గురు మహాత్మ బసవేశ్వరా 893వ జయంతి ఉత్సవాలు ఈ నెల 20 వ తేది సోమవారం రోజున,అధికారికంగా నిర్వహించాలని జిల్లా సదాశివపేటలో, మున్సిపాలిటీ, మండలం కేంద్రాలలో అధికారులు నిర్వహించాలని కోరారు, వీర శైవ సమాజం అధ్యక్షులు , కార్యదర్శి, కోశాధికారులు, చిల మల్లన్న , విశ్వనాథం, పులి మామిడి వీరేశంలు మాట్లాడుతూ మహాత్మ గురు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో వెలుగొందిన మహానుభావుడు, గొప్ప సామాజిక సంస్కర్త మరియు తత్వవేత్త. ఆయన సమ సమానత్వానికి ప్రతీకగా నిలిచి, కులవ్యవస్థ అంటరానితనం అనే అంధకారాన్ని తొలగించడానికి ధైర్యంగా పోరాడారు.
*కాయకమే కైలాసం* (work is Worship ) అనే మహాసూత్రంతో శ్రమకు గౌరవం ఇచ్చి, ప్రతి మనిషి సమానుడనే భావనను సమాజంలో నాటారు.
అనుభవ మంటపం ద్వారా జ్ఞానం, ధర్మం, న్యాయం ప్రసారం చేసి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆ కాలం లోనే మహిళలకు సమానత్వం వర్తింప చేసి అయన నిర్మించిన పార్లమెంట్ లొ మహిళలకు ప్రథమ స్థానం కలిపించిన గొప్ప మహానుభావులు.
ఆయన బోధనలు ఈ రోజుకీ కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తూ, సమానత్వం మరియు మానవత్వానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచాయి అనారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు
[18/04, 3:16 pm] ఉల్లిగడ్డల శివకుమార్ న్యూ: • తమిళనాడు సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు హాజరౌతున్న హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లు పంపిణీ.
• విధుల్లో ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి, సంగారెడ్డి జిల్లా కు మంచి పేరు తీసురావాలి : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
T G 5 :సంగారెడ్డి ప్రతిని ధి
తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న సాదారణ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు విధులకు సంగారెడ్డి జిల్లా నుండి వెళుతున్న 38 మంది హోమ్ గార్డ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. దూర ప్రాంతాలలో విధులు నిర్వహించేందు వెళుతున్న సిబ్బంది బాగోగులను దృష్టిలో ఉంచుకొని, అవసరమైన ప్రాథమిక ఔషధాలు, బిస్కెట్స్, వ్యక్తిగత అవసరాల సామగ్రి అందుబాటులో ఉండేలా ఈ కిట్లు అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే విధుల్లో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలున్న నేరుగా సంగారెడ్డి జిల్లా పోలీసు డ్యూటి డాక్టర్ కు కాల్ చేసి, మెడిసిన్స్ వివరాలను తెలుకోవచ్చు అన్నారు. విధి నిర్వహణలో లేదా వ్యక్తిగత సమస్యలున్నా సంబంధిత అధికారుల ద్వారా నా దృష్టికి తీసుకురాలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఆర్ డిఎస్పీ నరేందర్, పోలీసు డ్యూటి డాక్టర్ జ్యోతి, డానియెల్ ఆర్ఐ హోమ్ గార్డ్స్, ఆర్ఐ లు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రావ్, బందోబస్తు విధులకు వెళుతున్న ఆర్.ఎస్ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.









