కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు: మైనర్ అని తేల్చిన ఎన్సీఎస్టీ దర్యాప్తు!

కుంభమేళాలో ‘పూసల అమ్మాయి’గా సామాజిక మాధ్యమాల్లో విశేష గుర్తింపు పొందిన మోనాలిసా బోస్లే వివాహం ఇప్పుడు తీవ్ర చట్టపరమైన వివాదంగా మారింది. మోనాలిసాను ప్రేమ వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాహ సమయంలో మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్లేనని, ఆమె మైనర్ అని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) జరిపిన లోతైన విచారణలో వెల్లడవ్వడమే దీనికి ప్రధాన కారణం.

నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్వహించిన దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2009. దీని ప్రకారం 2026 మార్చి 11న కేరళలో పెళ్లి జరిగే సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల రెండు నెలలు మాత్రమే. వివాహ రిజిస్ట్రేషన్ కోసం ఆమెను మేజర్‌గా చూపిస్తూ ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్లను సమర్పించారని, ప్రస్తుతం ఆ నకిలీ పత్రాలను అధికారులు రద్దు చేశారు.

ఈ నివేదిక ఆధారంగా ఖర్గోన్ జిల్లా పోలీసులు ఫర్మాన్ ఖాన్‌పై పోక్సోతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. షూటింగ్ నిమిత్తం కేరళ వెళ్లిన మోనాలిసా, తన తండ్రి అభ్యంతరాలను కాదని ‘కే-స్మార్ట్’ యాప్ ద్వారా పెళ్లిని రిజిస్టర్ చేసుకుంది. అయితే వయసు నిర్ధారణలో పచ్చి అబద్ధాలు వెలుగుచూడటంతో ఫర్మాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 22న ఈ విషయంపై ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని కేరళ, మధ్యప్రదేశ్ డీజీపీలను ఎన్సీఎస్టీ ఆదేశించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు