గోపాల్ స్వామి గుడి తోట మైదానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రమశక్తి అవార్డు తెలంగాణ ప్రభుత్వం ద్వారా పొందిన చిప్ప వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించింది. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పరపతి సంఘ అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న చిప్ప వెంకటేశ్వర్లు గారిని ప్రభుత్వం గుర్తించి మేడే రోజు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది అని మా ప్రాంతానికి పేరు తెచ్చిన మాలో ఒక్కడు ఐన చిప్ప వెంకటేశ్వర్లును అభినందించడం జరిగింది అన్నారు. గోపాల స్వామి గుడి తోట మైదానం విషయంలో మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని శ్రమశక్తి అవార్డు గ్రహీతను కోరారు.
చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన నిలబడుతూ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావు ఆదేశానుసారం ముందుకు సాగుతానని మరియు గోపాల స్వామి గుడి తోట మైదానంలో ఉన్న సమస్యలను నా వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గిరి వేణి సారయ్య, కార్యదర్శి మర్రి వెంకటేశ్వర్లు, పులి సుదర్శన్, మాజీ అధ్యక్షులు గరిదాసు జయప్రకాష్,, పనికిరా సత్యనారాయణ, సిరబోయిన రాజు, అంజయ్య యాదవ్, చిప్ప ఐలయ్య, కోటేశ్వర్ ,రాజు , ఆనంద్, ప్రభాకర్, రాజలింగం , సూర్యనారాయణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.









