మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘాట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సైకో హాల్ చల్ చేశాడు, ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆసుపత్రి సిబ్బంది పై దాడి చేశాడు, ఆసుపత్రి బయట ప్రజాల పై కూడా దాడి చేసినట్లు సమాచారం, సైకోను పట్టుకొని బంధించేందుకు స్థానికులు ప్రయత్నించగా వారి పై కూడా దాడికి దిగడంతో స్థానికులు అతని పై విచక్షణ రహితంగా దాడి చేశారు, దీంతో ఆ సైకో తీవ్ర గాయాలపాలయ్యాడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు,పరిస్థితి విషమంగా మారింది, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ సైకోను మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు, ఆ సైకో ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది ..
Post Views: 272









