MRF కార్మిక పోరాట సమితి (KPS) 11 వ వార్షికోత్సవం 

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

ఈ వార్షికోత్సవ కార్యక్రమం వన దుర్గభవాని మాత దేవాలయం ఏడుపాయలు లో KPS అధ్యక్షులు కొత్త గొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి MRF మెదక్ ప్లాంట్ కార్మిక మిత్రులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సమావేశానికి సదాశివపేట మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మరియు పట్టణ రాజకీయ నాయకులు జిల్లా JAC నాయకులు సత్తయ్య యాదవ్ మరియు యూనియన్ నాయకులు మల్లేశం నారాయణ విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణ విఠల్ శ్రీనివాస్ రాజ్ కిరణ్ వెంకట్రావు వీరన్న సత్యనారాయణ రెడ్డి జైపాల్ నర్సింలు రాచయ్యా స్వామి MD నజీర్ పాల్గొనడం జరిగింది.. ఈ సమావేశంలో KPS యూనియన్ అధ్యక్షులు కొత్త గొల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ 11వ వార్షికోస్తానికి వచ్చిన కార్మికులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మీ అందరి సహకారంతో ఈ 11 సంవత్సరాల లో రెండుసార్లు యూనియన్ను గెలిపించడం జరిగింది.ఇకముందు కూడా యూనియన్ను ప్రోత్సహించాలని మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కార్మికుని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చెప్పటం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలపడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు