శని అమావాస్య సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ సప్తపురి శనిఘాట్ దేవస్థానమును సందర్శించిన పులిమామిడి రాజు

TG 5, సంగారెడ్డి ప్రతిని ధి

ఏడాకులపల్లి గ్రామంలో అమావాస్య సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు శ్రీ శ్రీ శ్రీ సప్తపురి శనిఘాట్ దేవస్థానాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. శనిఅమావాస్య పర్వదినం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.

భక్తులతో కలిసి పులిమామిడి రాజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వారి మిత్రులు నర్సింలు గోల్డుస్మిత్, బగిలి విష్ణు, భక్తులు పాల్గొన్నారు.

ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు