TG 5, సంగారెడ్డి ప్రతినిధి
వీరశైవ లింగాత్ సమాజం ఎడ్ల బజార్ అధ్యక్షులు వారి చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు గందిగా రాజు మాట్లాడుతూ
మే 23 వ తేదీన హైదరాబాద్ లో ఆల్ ఇండియా వీరశైవ మహాసభ వారిచే నిర్వహించబడు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమమునకు అధిక సంఖ్యలో పాల్గొని జగద్గురువుల ఆశీర్వదం పొంది కార్యక్రమం జయప్రదం చేయగలరని కోరారు
ఈ కార్యక్రమంలో ఆలిండియా వీరశైవ మహాసభ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుధీర్ కుమార్ పాటల్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని వీరశైవ లింగాయతులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు,
కార్యనిర్వాక అధ్యక్షులు అని శెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి హైదరాబాదులోఆది జగద్గురు పంచాచార్య యుగమనోత్సవము, శ్రీ మహాత్మ బసవేశ్వర జయంతోత్సవాల, తోపాటు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినటువంటి అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది, అధిక సంఖ్యలో వచ్చి గురువుల ఆశీర్వాదాలు పొందగలరని కోరారు ఈ కార్యక్రమంలో , ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాధి రాచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ అడ్వకేట్, సమాజ సభ్యులు రాచప్ప, రమేష్, రవి, సురేష్ , శేఖర్, శేఖర్, సతీష్, రవణప్ప, , షాబాద్ వీరన్న, విశ్వనాథ్,ప్రవీణ్,లోకేష్,మల్లేశం,వైద్యనాథ్,మరియు మహిళా సభ్యులు అన్నపూర్ణ, కవిత, అన్నపూర్ణ, పల్లవి ,సంధ్యా ,రమా ,స్వాతి , శిరీష ,పల్లవి, లలిత సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు









