బక్రీద్ వేళ శాంతి సామరస్యాలే లక్ష్యం: జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు, ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరికలు

• బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు వివిధ కులాలు, మతాలకు చెందిన పెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు.

• పరస్పర సహకారం, సామరస్యంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

TG 5,సంగారెడ్డి ప్రతినిధి:

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలలో పాల్గొన్న వివిధ కులాలు, మతాలకు చెందిన పెద్దలు, మత నాయకులు, ప్రజాప్రతినిధులకు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జిల్లా నుండి ఎలాంటి పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా నలుమూలలా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 24×7 చెక్‌పోస్టుల నిర్వహణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

పండుగ సమయంలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని, జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ద్వారా సోషల్ మీడియాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టరిత్య కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 లేదా డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు