అధికారులు అంకితభావంతో పనిచేయాలి – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.

స్టేషన్ అధికారులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని వరంగల్ సిపి సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ ఆదేశాల మేరకు హసన్ పర్తి, కాజీపేట పోలీస్ స్టేషన్ల నూతన ఇన్స్ స్పెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్లు మహేందర్, శ్యాంసుందర్ గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను సిపి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజాయితీతో విధులు నిర్వహిస్తూ, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితులకు కలిగించాలని పోలీస్ కమిషనర్ నూతన ఇన్స్ స్పెక్టర్ల కు దిశా నిర్దేశం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు