వరుస మోటర్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న దొంగ అరెస్ట్

TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి:-సదాశివపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తిని సదాశివపేట పోలీసులు పట్టుకొని అతడి నుంచి మూడు ద్విచక్రవాహనలను స్వాధీనం చేసుకున్నారు. సదాశివపేట పట్టణ ఇన్స్పెక్టర్ D. వెంకటేష్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నేరస్తుడు ఇష్రీతాబాద్ గ్రామానికి చెందిన బలరాం సంగమేశ్వర్ అను అతను జల్సాలకు, మద్యానికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని ఇదే నెలలో ఇష్రీతాబాద్ గ్రామంలో పల్సర్ బైక్, ఆత్మకూరు గ్రామంలో గ్లామర్ బైక్, సదాశివపేట పట్టణంలో స్ప్లెండర్ ప్లస్ బైక్ ని దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుండి మూడు బైకులను స్వాధీనం చేసుకొని నేరస్తుడిని రిమాండ్ కు తరలించినట్లు సదాశివపేట ఇన్స్పెక్టర్ డి.వెంకటేష్ తెలిపినారు. దొంగలను పట్టుకున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాష, మల్లేశంను ఇన్స్పెక్టర్ అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు