TG 5, సంగారెడ్డి ప్రతినిధి
- మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేజేఎస్ యూనిట్–IIకి శ్రీకారం
- 1,500 మందికి స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు
- జగ్గారెడ్డి, నిర్మల కృషితో ముందుకు వచ్చిన ప్రాజెక్ట్
- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం తో , మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సహకారంతో సంగారెడ్డి కి తరలివచ్చిన పరిశ్రమ
- కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ గ్రామం లో కేజేఎస్ పరిశ్రమ కు నేడు శంకుస్థాపన చేయనున్న పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ
- స్థానిక యువతకు ఉపాధి – తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి ఊతం
- కాన్ఫెక్షనరీ నుంచి బేవరేజెస్ వరకు విస్తృత ఉత్పత్తుల తయారీ
- పాశమైలారం తర్వాత తొగర్‌పల్లిలో మరో భారీ యూనిట్
సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. KJS India Private Limited ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం తొగర్పల్లి–అలియాబాద్ ప్రాంతంలో “కేజేఎస్ యూనిట్–II” పేరుతో సమగ్ర ఆహార & పానీయాల తయారీ కేంద్రానికి రేపు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి లు భూమిపూజ చేయనున్నారు.
సుమారు రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 1,500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం పాశమైలారం యూనిట్‌లోనే వందలాది మహిళలు పనిచేస్తుండటం విశేషం.
సంగారెడ్డి నియోజకవర్గం లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో ఇక్కడే పరిశ్రమ నెలకొల్పాలని టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి లు కోరారని, వారి కృషి తోనే పరిశ్రమ స్థాపన కు ముందుకు వచ్చామని పరిశ్రమ ప్రతినిధులు తెలియజేశారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహంతో, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి ల సహకారంతో పరిశ్రమ స్థాపనకు వేగం చేకూరిందన్నారు.
సంగారెడ్డిని ఫుడ్ & FMCG హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగు
కాన్ఫెక్షనరీ, బేవరేజెస్, కాఫీ, న్యూట్రాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలతో ఏర్పడనున్న ఈ యూనిట్ తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, స్థానిక యువతకు మరియు మహిళలకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది.
సంగారెడ్డి మహిళలకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పరిశ్రమ రావడం ఒక మహిళ గా ఇది నాకు గర్వ కారణం
టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి నియోజకవర్గం లో 1500 మహిళలకు ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తుండటం సంతోషంగా ఉంది. ఒక మహిళగా ఇది నాకు గర్వ కారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకట స్వామి ల సహకారం వల్లనే ఇది సాధ్యమైంది.









