హామీల అమలులో ప్రభుత్వ జాప్యం: ఈనెల 19న వరంగల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ధర్నా

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగం కారులకు 250 గజములు ఇంటి స్థలము ప్రతి నెలకు 25 వేల రూపాయల పెన్షన్స్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొని రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 19వ తారీఖున కరీమాబాదులోని చెట్లోళ్ల గడ్డ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టుతామని వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమ కారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి అన్నారు గురువారం రోజున కరీమాబాదులోని ఎస్కే గౌడ్ కళాభవన్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశమునకు కన్వీనర్ మరుపల్ల రవి అధ్యక్షత వహించి మాట్లాడినాడు నేటి రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆయన అన్నారు అసలు ఉద్యమకారులు ఎవరో ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్యమకారుల వివరాలను అడిగినారే కానీ ఇంతవరకు ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించలేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలము ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్ అమలు జరుపుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు చొరవ చూపాలని ఉద్యమంలో మరణించిన ఉద్యమకారుల కుటుంబంలో ఏ ఒక్కరికైనా పథకాలు వర్తించాలని ఉద్యమ సమయంలో కేసులు కానీ ఉద్యమకారులను పోలీస్ శాఖ ద్వారా గుర్తించి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ మరుపల్ల రవి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో ఉద్యమకారులు సిద్ధం రాజు శంకేషి లింగమూర్తి మేకల ఎల్లయ్య అంకం దేవానంద్ పరికిపండ్ల ఈశ్వరయ్య గుండు సదానందం సోమ మధుకర్ మాడిశెట్టి రాజకుమార్ భౌరిశెట్టి సదానందం ఆవునూరు లక్ష్మి కొడిపాక రమాదేవి పల్లకొండ యా కలక్ష్మీ చిదురాలసుజాత కొండపాక లక్ష్మి సోమ ఉపేంద్ర లు ఉన్నారు……

 

వరంగల్ రిపోర్టర్ బషీర్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు