తాళ్ల మండవాలో ఉద్రిక్తత: యువకుడిపై కత్తులతో దారుణ దాడి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తాళ్ల మండవాలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. గొడిశాల విజయ్ కళ్యాణ్‌పై అక్కినపల్లి అఖిల్ కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో విజయ్ కళ్యాణ్ తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు