సీనియర్ జర్నలిస్ట్, మన సహచర మిత్రుడు పి. జగదీశ్ కుమార్ అనారోగ్య కారణాలవల్ల ఈ రోజు అకాల మరణం చెందడం జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో కాలంగా జర్నలిజం రంగంలో నిబద్ధతతో పనిచేసిన ఆయన తన స్నేహపూర్వక స్వభావం, నిజాయితీ గల వార్తా రచనతో సహచరుల అభిమానాన్ని పొందారు.
ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు జర్నలిస్టులు, మిత్రులు, ప్రజా ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పి. జగదీశ్ కుమార్ గారి అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్‌లోని లస్కర్ గూడ ప్రాంతంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 40









