మారేపల్లిలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు

నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.ప్రముఖ పురోహితులు ఎస్.బి. శేషాచార్యుల పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి నవ కలశ అభిషేకం, హనుమత్ సంకల్పంతో కూడిన హనుమత్ హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆకు పూజ మరియు ప్రత్యేక అభిషేకాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయం హనుమన్నామ స్మరణతో మారుమోగింది.ఈ పూజా కార్యక్రమాల్లో దేవదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి అంబాటి నాగిరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు తిరుమల వెంకటాచార్యులు – లక్ష్మి దంపతులు కూడా పూజలో కూర్చుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.వేడుకల్లో పురోహితులు శ్రీమన్నారాయణ, పవన్ లతో పాటు మారేపల్లి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మారేపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు