నిషేధ జాబితా నుంచి తొలగించండి కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన బాధితులు

బడంగ్ పేట్ సర్కిల్
గుర్రంగూడ లోని పలు
సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పొందుపర్చా రని… అవన్నీ పట్టా భూములని, అందులో నుంచి తొలగించాలని గుర్రంగూడ ఆదిత్యనగర్ కి చెందిన వై. శ్రీనివాసులు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టరు విన్నవించారు.గుర్రంగూడ లోని సర్వే నంబర్లు 193 నుంచి 196 వరకు, 201 నుంచి 204 వరకు ఉన్న భూములు చాలా ఏళ్ల క్రితమే లే అవుట్లుగా మారాయని తెలిపారు.
ప్రస్తుతం అధికారులు సబ్ రిజిస్టర్ రికార్డుల్లో 22-ఏ ప్రభుత్వ భూమి అని జాబితా లో పొందుపర్చడం తో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలి చిపోయాయని వాపోయారు.తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్),బాలాపూర్ మండల్ నాదర్గుల్ రెవిన్యూ అధికారులు అ భూమితో తమకు ఎలాంటి సంబంధం లేదని ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్టు తెలిపారు.వాటికి సంబంధించిన పత్రాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చినా ఆ జాబితా నుంచి తొలగించలేదని వివరించారు.దీని పై నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి లో ఫిర్యాదు చేయడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు.2025 నవంబర్ వరకు రిజిస్ట్రేషన్ లు జరిగాయని గత ఆరు నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిపివేయడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.గత 30 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని ఒక్కసారిగా నిలిపివేయడం తో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని దీని పై కలెక్టర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు