సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సీపీఎం ధర్నా: ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించి, జొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్

  • సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
  • జొన్నలు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
  • ఆరుగాలం కష్టపడినా ధాన్యం మిల్లర్లు, వ్యాపారస్థులకు అమ్ముకునే దుస్థితా?
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
  • సంగారెడ్డి జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు సీపీఎం ధర్నా… కలెక్టర్ కి వినతిపత్రం

TG 5, సంగారెడ్డి ప్రతిని ధి

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని, జొన్నాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను మధ్యలో దళారులు చేరి మిల్లర్లకు, వ్యాపారులకు అమ్ముకునే దుస్థితి తెస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వాహనాలు సరిపడా లేవన్నారు. రైతులు అమ్ముకున్న పంటకు ఎదురు చూడకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా వర్షాలు పడి రైతులు రాత్రింబవాళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యాన్ని రైతులకు అందజేయాలన్నారు. తరుగు పేరుతో క్వింటల్ కు 6 నుండి 7 కిలోలు తీస్తూ రైతులను దోచుకోవడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వెంటనే సరిపడా సంచులు వేంటనే సరఫరా చేయాలని, హమాలీల సమస్యలు పరిస్కారం చేయాలని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో మంచినీళ్లు, కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

 అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 90 వేల పైన ఎకరాలలో జొన్న సాగైందని, రైతుల వద్ద జొన్నలు అమ్ముడు పోక, కొనుగోలు కేంద్రాలు తెరవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలనీ అన్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని ప్రభుత్వం ను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం,ఎ.మాణిక్, జి.సాయిలు, జిల్లా కమిటి సభ్యులు కృష్ణ, నాయకులు అశోక్, రాజయ్య, రమేష్ గౌడ్, మంజుల, మహేష్, భూషణం, నర్సింలు, వెంకటేశం, ప్రభాకర్ తది తరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు