TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణంలోని నిజాంపూర్ రోడ్ బైపాస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాప్రైటర్ చిల్కూరి నరేందర్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఈ పెట్రోల్ పుంపు వలన సదాశివపేట మరియు ఇతర గ్రామాలకు వెళ్లే వాహన దారులకు ఇక పెట్రోల్ కష్టాలు తీరుతాయని అన్నారు. ప్రజలు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పుంపును ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో నరేందర్, రవీందర్, సురేందర్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ బోడగామా భూషణం, గంట శివన్న మొదలగు వారు పాల్గొన్నారు.
Post Views: 8









