దక్షిణాది సినీ పరిశ్రమలో మరోసారి వివాదం చెలరేగింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర, స్టార్ హీరోయిన్ త్రిషపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన సుచిత్ర.. త్రిషను ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడారు. ఏకంగా త్రిషను ఒక ‘పరాన్నజీవి’ (పారాసైట్) అని అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
గతంలో ‘సుచీ లీక్స్’ వ్యవహారంతో ఇండస్ట్రీని షేక్ చేసిన సుచిత్ర, తరచుగా సినీ ప్రముఖులపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా త్రిషను టార్గెట్ చేస్తూ.. ఆమె ఇతరుల మీద ఆధారపడి, వారి అవకాశాలను వాడుకుంటూ పైకి ఎదుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. స్వతహాగా ఎదిగే లక్షణం లేని కారణంగానే ఆమెను పరాన్నజీవితో పోల్చినట్లు సుచిత్ర తన కామెంట్స్ ద్వారా పరోక్షంగా స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎంతో క్రేజ్ ఉన్న తమ అభిమాన హీరోయిన్ పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని వారు సుచిత్రను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. సాధారణంగా త్రిష ఇలాంటి వివాదాలను పెద్దగా పట్టించుకోరు, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. అయితే, సుచిత్ర చేసిన ఈ తాజా ఆరోపణల వ్యవహారం మాత్రం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.









