మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్.టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో రెవెన్యూ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
చెరువు పరిధిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు.
మేడిపల్లి మండలం రెవెన్యూ శాఖ సిబ్బంది, స్థానిక అధికారులతో కలిసి ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన షెడ్లు, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు.
చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్ లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
Post Views: 14









