కట్టవారిగూడెం సర్పంచ్ కుమారుని పట్టు వస్త్ర అలంకరణ మహోత్సవం: హాజరైన రాష్ట్ర నాయకులు వెలగపూరి కరుణాకర్

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం గ్రామ సర్పంచ్ ప్రమీల చక్రవర్తి కుమారుడు రిత్విక్ పట్టు వస్త్ర అలంకరణ మహోత్సవం ధర్వేశిపురం గ్రామంలోని యాదగిరి రెడ్డి ఫంక్షన్ హాల్‌లో అత్యంత వైభవంగా, కన్నుల పండువలా జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, రాజకీయ నాయకులు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు వెలగపూరి కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారి రిత్విక్‌ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో సర్పంచ్ ప్రమీల చక్రవర్తితో పాటు వెలగపూరి రాంబాబు రావు, సర్పంచ్ ఈశ్వరమ్మ, మారపాక నరేందర్, శివ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చిన అతిథులకు సర్పంచ్ కుటుంబ సభ్యులు ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. చిన్నారి రిత్విక్ భవిష్యత్తు బాగుండాలని కోరుతూ అందరూ ఆశీస్సులు అందించడంతో ఈ మహోత్సవం ఘనంగా ముగిసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు