రంగా రెడ్డి జిల్లా… షాబాద్ మండలమ్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ను ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి లతో కలిసి స్కూల్ ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడు పాఠశాలలో నాణ్యమైన విద్య విలువలతో కూడిన బోధన అందించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత స్థాయి విద్యా అవకాశాలు కల్పించే దిశగా ఈ పాఠశాల ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణమే నిజమైన అభివృద్ధి అని పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే పాఠశాల ప్రధాన బాధ్యతగా ఉండాలన్నారు కేవలం మార్కుల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరు వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీషు సైన్సు కంప్యూటర్ విద్య బలపడాలన్నారు..
మాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్,కొరస్పాండెంట్ వాజిత్. మాట్లాడుతూ ఏ ఏ ఐ ప్యానల్ పై బోధన మా పాఠశాల ప్రత్యేకత అన్నారు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక తీసుకుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, మల్కాపూర్ మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ డిసిసి ప్రధాన కార్యదర్శి కుమ్మరి చెన్నయ్య. సర్పంచులు అశోక్ ప్రభాకర్ రెడ్డి సబితా గోవర్ధన్ రెడ్డి సందీప్ గౌడ్ పెంటయ్య రాజు నరసింహులు పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్, డైరెక్టర్ లు విజయలక్ష్మి,మల్లేష్,ఆఫీస్,అమిత్ భాష,వినీత,ఉపసర్పంచ్ రాహుల్ గుప్తా మాజీ సర్పంచ్ రవీందర్ వెంకట్ రెడ్డి రవీందర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.









